Home న్యూస్ రామ్ పోతినేని మాస్….50 గంటలతో దంచికొడుతున్నాడుగా!

రామ్ పోతినేని మాస్….50 గంటలతో దంచికొడుతున్నాడుగా!

0

ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని(Ram Pothineni) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఆ సినిమా సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) తో త్వరలోనే సందడి చేయడానికి సిద్ధం అవ్వగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…

రామ్ పుట్టిన రోజు కానుకగా సినిమా టీసర్ రిలీజ్ అవ్వగా మొదటి పార్ట్ టీసర్ తో పోల్చితే జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నా కూడా ఓవరాల్ గా మరోసారి రామ్ క్యారెక్టరైజేషన్ మీదే ఫోకస్ అయిన టీసర్ ఆడియన్స్ ను బాగానే మెప్పించగా 24 గంటల్లో ఓవరాల్ గా మరీ రికార్డులు బ్రేక్ చేయక పోయినా కానీ ఉన్నంతలో…

మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపగా టీసర్ రిలీజ్ అయిన కొంత సేపటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయిన డబుల్ ఇస్మార్ట్ టీసర్ 50 గంటలకు పైగా ఇప్పుడు టాప్ ప్లేస్ లో యూట్యూబ్ ట్రెండ్ అవుతూ జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. టాప్ స్టార్ మూవీస్ అంటే ఈజీగా ఇలా ట్రెండ్ అవుతాయి కానీ…

మీడియం రేంజ్ మూవీస్ ఇలా ట్రెండ్ అవ్వడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా టీసర్ కి రెస్పాన్స్ మరీ ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ లో లేక పోయినా కూడా యూట్యూబ్ లో రీచ్ ని చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. ట్రైలర్ కొంచం క్లిక్ అయినా కూడా ఇక సినిమా మీద రచ్చ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here