బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా మొదటి వారాన్ని ఇప్పుడు రిమార్కబుల్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా సాధించిన కలెక్షన్స్ సాయి ధరం తేజ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా ఇప్పుడు…
7వ రోజు మరోసారి తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ ని చూపించగా 2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని పించేలా హోల్డ్ చేయగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను 42 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 57 కోట్ల మార్క్ ని దాటేయడానికి సిద్ధం అవుతుంది. ఓవరాల్ గా సాయి ధరం తేజ్ కెరీర్ లో ఇవి ఆల్ టైం బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.