Home న్యూస్ 5 డేస్ భ్రమయుగం కలెక్షన్స్….ప్రయోగాత్మక సినిమా…ఊచకోత కలెక్షన్స్!

5 డేస్ భ్రమయుగం కలెక్షన్స్….ప్రయోగాత్మక సినిమా…ఊచకోత కలెక్షన్స్!

0

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ…. భ్రమయుగం(Bramayugam Movie Box Office Collections) ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కింది….బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ సినిమా యునానిమస్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా….

కలెక్షన్స్ పరంగా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తూ ఉండటం విశేషం…చాలా వరకు ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కి ఎంత టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయవు…కానీ మలయాళంలో భ్రమయుగం సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది……

కేరళలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో 13.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా ఇండియాలో సినిమా 17.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది….

ఇక్కడ సాధించిన కలెక్షన్స్ ఒకెత్తు అయితే ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ ఈక్వల్ గా జోరు చూపిస్తూ 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 34.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఎక్స్ పెరిమెంటల్ మూవీకి ఇవి ఊరమాస్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక డబ్ వర్షన్ ఈ నెల 23న రిలీజ్ కానుండటంతో ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here