తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకరైన విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ లాఠీ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమాలో విశాల్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగానే నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ 30 లక్షల వరకు సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా….
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2.95 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా షేర్ పరంగా ఆల్ మోస్ట్ 1.40 కోట్ల దాకా సొంతం చేసుకుంది ఇప్పుడు. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 4 కోట్ల దాకా ఉండగా సినిమా…
4.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 5 రోజుల తర్వాత ఇంకా 3.10 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 7.80 కోట్ల గ్రాస్ ను 3.7 కోట్ల షేర్ ని అందుకుని అన్ని చోట్లా తీవ్రంగానే నిరాశ పరిచింది అని చెప్పాలి.