నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 సెకెండ్ క్లీన్ హిట్ గా నిలిచింది, 4 రోజుల్లో నే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ ని వెనక్కి తెచ్చి సత్తా చాటుకోగా అన్ సీజన్ అయినా కానీ సినిమా స్టడీ గా 4 రోజుల పాటు కేవలం మినిమమ్ డ్రాప్స్ తోనే అనుకున్న టార్గెట్ ని అందుకోవడం తో 5 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి గా మారగా సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు షోల కి 4 వ రోజు తో పోల్చితే 60% నుండి 65% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చే సరికి…
డ్రాప్స్ తగ్గి టోటల్ గా 45% నుండి 50% వరకు డ్రాప్స్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె 60 లక్షల నుండి 80 లక్షల లోపు వసూళ్లు అందుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
అది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 5 వ రోజు కలెక్షన్స్ విషయం లో డ్రాప్ అయినా తిరిగి తేరుకుని మరోసారి స్టడీ గానే రోజు ని ముగించే దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి.
ఇప్పటికే టార్గెట్ కంప్లీట్ అవ్వగా సినిమా 5 వ రోజు నుండి సాధించే కలెక్షన్స్ అన్నీ లాభాలే అవ్వడం తో ఎంత వరకు కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది. మరి 5 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.