Home న్యూస్ 91 కోట్ల బిజినెస్… 6 డేస్ టోటల్ కలెక్షన్స్ భీభత్సం ఇది!

91 కోట్ల బిజినెస్… 6 డేస్ టోటల్ కలెక్షన్స్ భీభత్సం ఇది!

0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 5 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 52.74 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 72.2 కోట్ల షేర్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 120 కోట్లకు పైగా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజున మొదలు అవ్వడం స్లోగా మొదలు అయినా డే ఎండింగ్ మాత్రం అదిరిపోయింది.

టోటల్ గా రెండు రాష్ట్రాలలో 2.9 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు మరో 70 లక్షలకు పైగా షేర్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో టోటల్ గా 6 వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 3.6 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది..

దాంతో సినిమా 6 రోజుల్లో రెండు రాష్ట్రాల లో 55.64 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 75.8 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 126 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుని ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేసింది… ఇక సినిమా 7 వ రోజు జోరు ఎలా ఉంటుంది అన్నది అందరి లోనూ ఆసక్తి రేపుతుంది.. దసరా హాలిడేస్ ఆఫీసులకి బ్యాంకులకు ఇవ్వడం తో ఈ రోజు నుండి సినిమా ఎంత గట్టిగా హోల్డ్ చేస్తే టోటల్ రన్ లో భారీ వసూళ్లతో దుమ్ము లేపే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here