Home న్యూస్ 60* కోట్ల జాతర సామి….తుక్కు రేగ్గొడుతున్న పుష్ప రాజ్!!

60* కోట్ల జాతర సామి….తుక్కు రేగ్గొడుతున్న పుష్ప రాజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, రీసెంట్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో ఓపెన్ అవ్వగా…

అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతుంది. హిందీ లో రిమార్కబుల్ స్టార్ట్ తర్వాత మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ అవ్వగా రిమార్కబుల్ స్టార్ట్ ను ఇక్కడ కూడా సొంతం చేసుకుంది సినిమా ఇప్పుడు…

కాగా ఓవర్సీస్ లో ఆల్ రెడీ 3 మిలియన్స్ కి పైగా డాలర్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా హిందీలో ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ గ్రాస్ మొదటి రోజుకి గాను ఆల్ మోస్ట్ 15 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది….ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క…

17 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లిమిటెడ్ గా ఓపెన్ అవ్వగా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇండియాలో మొదటి రోజుకి గాను సినిమా…

అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 34 కోట్ల రేంజ్ కి చేరువ అవ్వగా ఓవర్సీస్ బుకింగ్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క ఏకంగా 60 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం, రిలీజ్ కి ఇంకా 3 రోజుల టైం ఉండగా సినిమా ఆ టైంకి రికార్డ్ లెవల్ బుకింగ్స్ తో మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here