బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చాలా సినిమాలలో వెన్నెల కిషోర్(Vennela Kishore) హీరోగా మారిన లేటెస్ట్ మూవీ చారి111(Chaari111 Movie) ఒకటి…. పర్వాలేదు అనిపించే కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అలరించడంలో పెద్దగా సఫలం అవ్వలేదు…
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరగానే పరుగును పూర్తి చేసుకున్న సినిమా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… 1.5 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ లో సగం వరకు మాత్రమే రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఫ్లాఫ్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. అక్కడ రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా టాక్ కి అతీతంగా మంచి వ్యూవర్ షిప్ తో జోరు చూపించడం విశేషం, కొన్ని రోజులు టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా….
అమెజాన్ ప్రైమ్ లో మొత్తం మీద డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఓవరాల్ గా 60 మిలియన్స్ వరకు యూనిక్ 1 మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం, పెద్ద సినిమాలకు అంటే ఇది మామూలే కానీ చిన్న సినిమాకి, అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే…
రిజల్ట్ ను సొంతం చేసుకున్న చారి111 లాంటి సినిమా కి 60 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైం అలాగే మూవీ ట్రెండ్ అవుతూ జోరు చూపించడం విశేషం అని చెప్పాలి. ఇక త్వరలోనే టెలివిజన్ లో టెలికాస్ట్ కానున్న ఈ సినిమాకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇక…