నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా 6 వ రోజున స్లో డౌన్ అయింది, రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షల సమయం అవ్వడం, అన్ సీజన్ ఉండటం తో ఆ ఎఫెక్ట్ ఈ రోజు క్లియర్ గా కనిపించింది అని చెప్పాలి. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజున సినిమా…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి టోటల్ గా 50% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి కొంచం గ్రోత్ ని సాధించినా అది పూర్తీ సంతృప్తి కరంగా అయితే లేదనే చెప్పాలి. అయినా కానీ సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే విధంగా…
40% వరకు డ్రాప్స్ ని అందుకుని రోజు ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించే దిశగా అడుగులు వేస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే సినిమా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 50 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఒకవేళ అనుకున్న విధంగా లేక పొతే 40 లక్షల కి అటూ ఇటూ గా సినిమా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల భాట పట్టిన ఈ సినిమా మినిమమ్ గ్రోత్ తో సెకెండ్ వీకెండ్ దాకా ఇదే జోరు చూపినా కానీ…
అవలీలగా 10 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ 118 తో కెరీర్ సెకెండ్ బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేసే అవకాశం ఉందని చెప్పాలి. చూద్దాం ఫైనల్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.