ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు!

0
916

     2015 నుండి ఇప్పటి వరకు ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ఒక్క అప జయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తూ ప్రస్తుతం ఉన్న టాప్ హీరోల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న సినిమా RRR. టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

కాగా షూటింగ్ లో భాగంగా రీసెంట్ గా రామ్ చరణ్ తో షెడ్యూల్ ని పూర్తీ చేసిన రాజమౌళి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో షూట్ ని మొదలు పెట్టి రీసెంట్ గా హైదరాబాదు లో కొన్ని రోజుల షూటింగ్ ని చేశాడు. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ నేడు కోల్కతా లో మొదలు అయింది.

అందులో ముందుగా ఎన్టీఆర్ తో కొన్ని కీలక టాకీ పార్ట్ కి సంభందించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. సుమారు 10 నుండి 15 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ తర్వాత అక్కడే రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిపి మరింత షూటింగ్ ఉంటుందట.

అది దాదాపు 25 రోజుల కి పైగానే ఉంటుందని సమాచారం. మొన్నటి వరకు రామ్ చరణ్ వంతు షూటింగ్ అవ్వడం ఇప్పుడు ఎన్టీఆర్ వంతు షూటింగ్ కూడా అవుతుండటంతో సినిమా కి ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ శరవేగంగా సాగుతుందని యూనిట్ చెబుతుంది.

ఇక సినిమా అన్ని హంగులను పూర్తీ చేసుకుని 2020 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, బాహుబలి రికార్డుల బెండు తీసే అన్ని అర్హతలు ఈ సినిమా కే ఉన్నాయని అంటుండటం తో ఇటు నందమూరి అటు మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!