మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 18.7 కోట్లకు పైగా షేర్ ని అందుకుని స్ట్రాంగ్ గా వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్ ని సాధిస్తూ బ్రేక్ వైపు దూసుకు పోతుంది, కాగా సినిమా ఇప్పుడు 6 వ రోజు లో ఎంటర్ అవ్వగా తొలి 2 షోలకు 5 వ రోజు తో పోల్చితే సుమారు 30% కి….
పైగానే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమా… ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు పుంజుకున్నా అది మరీ అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి. దాంతో ఈ రోజు కూడా సినిమా షేర్ 1 కోటి కి పైగానే ఉంటుంది అనుకున్నా…
కొంచమ్ షాక్ ఇస్తూ 1 కోటి కన్నా తక్కువ షేర్ తోనే రోజు ని ముగించ బోతుంది వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమా.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మొత్తం మీద సినిమా ట్రెండ్ చూస్తుంటే 80 లక్షల నుండి 90 లక్షల లోపు షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో భారీ గ్రోత్ ఉంటె తప్పితే మాగ్జిమం ఈ కలెక్షన్స్ నే అందుకోబోతున్న సినిమా 6 వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 1 కోటి రేంజ్ లో షేర్ ని క్రాస్ చేయవచ్చు. దాంతో సినిమా 6 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్క 19.7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.
సినిమా మొదటి వారాన్ని 20 కోట్లకి పైగా కలెక్షన్స్ తో ముగించ నుండగా రెండో వీకెండ్ సినిమా కి కీలకంగా మారనుంది. ఎలాగూ పెద్దగా పోటి అయితే లేదు కాబట్టి సినిమా ఎంత సాధ్యమైతే అంత వసూల్ చేస్తే సైరా థియేటర్స్ కి రాకముందే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవచ్చు, ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.