బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఉన్న సినిమాల్లో సర్దార్ మరియు ఓరి దేవుడా సినిమాలు కొంచం పర్వాలేదు అనిపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా మిగిలిన సినిమాలు అంతంతమాత్రమే హోల్డ్ చేసి పరుగును కష్టతరం చేసుకుంటూ ఉండగా కాంతార సినిమా కొత్త సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది…
ముందుగా జిన్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవాళ అటూ ఇటూగా 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రిన్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక సర్దార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు అటూ ఇటూగా 35 లక్షల రేంజ్ నుండి 40 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఒరిదేవుడా సినిమా ఈ రోజు అటూ ఇటూగా 20 లక్షల నుండి 23 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు.
ఇక కాంతార సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక అన్ని సినిమాల 6 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.