Home న్యూస్ ప్రిన్స్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్…ఇవి సరిపోవు సామి!!

ప్రిన్స్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్…ఇవి సరిపోవు సామి!!

0

కోలివుడ్ సెన్సేషన్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ అని టాక్ వచ్చినా కానీ జనాలను థియేటర్స్ కి అనుకున్న విధంగా అయితే రప్పించ లేక పోయింది. హాలిడేస్ తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం ఎక్కువగా డ్రాప్ అవుతూ పరుగును కష్టతరం చేసుకుంటూ వెళుతుంది ఇప్పుడు.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 27 లక్షల రేంజ్ లో షేర్ ని 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా, ఇక తేరుకునే అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు.

సినిమా టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam – 1.07Cr
👉Ceeded – 28L
👉Andhra – 1.29Cr
Total AP TG – 2.64CR(5.00Cr~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వర్త్ బిజినెస్ 6.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 7 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 5 రోజుల తర్వాత సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here