సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ పరంగా మాత్రం ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా….
సినిమా 5 రోజుల లాంగ్ వీకెండ్ లో 43% రేంజ్ లోనే రికవరీని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఇక 6వ రోజు నుండి ఫుల్ వర్కింగ్ డేస్ టెస్ట్ లోకి ఎంటర్ అయిన సినిమా, ఓవరాల్ గా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అనుకున్న దాని కన్నా కూడా..
కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఇప్పుడు…ఓవరాల్ గా సండే తో పోల్చితే మండే డ్రాప్స్ ఏకంగా 70% కి పైగానే ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా ఆఫ్ లైన్ లెక్కలు కొంచం పర్వాలేదు అనిపించేలా ఉంటే కనుక…
సినిమా 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 22-24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉండగా….ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
అటూ ఇటూగా 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమాకి వర్కింగ్ డేస్ లో ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి… ఇక సినిమా నైట్ షోలకు ఏమైనా గ్రోత్ ని చూపించగలుగుతుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకోగలుగుతుందో చూడాలి ఇక….