Home న్యూస్ 6th డే టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ఆగని మాస్ జాతర!

6th డే టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ఆగని మాస్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) సినిమా 5వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ తర్వాత 6వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయినా కూడా…

అన్ని చోట్లా మంచి హోల్డ్ ని మరోసారి చూపెడుతూ దూసుకుపోతుంది ఆల్ మోస్ట్ 25% రేంజ్ లోపే డ్రాప్స్ ను 5వ రోజుతో కంపేర్ చేస్తే సొంతం చేసుకున్న సినిమా నైజాంలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా సీడెడ్ లో కూడా మంచి జోరుని చూపెడుతుంది. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…

Tillu Square 5 Days Total WW Collections

ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 2.1 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.6 కోట్ల రేంజ్ నుండి 2.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఓవరాల్ గా షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి జోరుని చూపిస్తూ ఉండటంతో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద 6 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Tillu Square 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here