మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. సినిమా మొత్తం మీద నిరాశ పరిచే ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఫేట్ కూడా డిసైడ్ అయ్యింది అని చెప్పాలి. సినిమా 7 వ రోజు అనుకున్న కలెక్షన్స్ కన్నా కొంచం బెటర్ గానే కలెక్షన్స్ ని అందుకున్నా కానీ అవి సినిమా బిజినెస్ ను…
అందుకోవడానికి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. సినిమా 7 వ రోజు 12-15 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అనుకున్నా సినిమా మొత్తం మీద 16 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మొదటి వారంలో వరల్డ్ వైడ్ సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.82Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 70L
👉East: 40L
👉West: 38L
👉Guntur: 43L
👉Krishna: 41L
👉Nellore: 29L
AP-TG Total:- 5.51CR(9.15CR~ Gross)
Ka+ROI: 30L
OS – 45L
Total WW: 6.26CR(11.61CR~ Gross)
సినిమా 12.5 కోట్ల టార్గెట్ కి ఇంకా 6.24 కోట్ల దూరంలో ఉంది. ఇక ఆ మార్క్ ని అందుకోవడం అసాధ్యం కాబట్టి డిసాస్టర్ రిజల్ట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి ఇప్పుడు.