సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల తర్వాత కూడా అదిరి పోయే కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండగా… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన రికార్డుల ఊచకోత మరో రేంజ్ లో ఉందని చెప్పాలి. 34.5 కోట్ల బిజినెస్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజులు పూర్తీ అయ్యే సరికి ఏకంగా 72 కోట్లకు పైగా షేర్ ని అందుకుని అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
రిలీజ్ కి ముందు సినిమా ఎంత పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ మహా అయితే 40 నుండి 50 కోట్లు అందుకుంటే గొప్పే అనుకున్నారు ప్రతీ ఒక్కరు, కానీ పోటి లో ఉన్న సినిమాలు పూర్తిగా స్లో డౌన్ అవ్వడం ఈ సినిమా కి ఫ్యామిలీస్ లో క్రేజ్…
మరో లెవల్ లో రావడం తో 50 అనుకున్న మాగ్జిమం టార్గెట్ పెరుగుతూ 60 కి చేరి తర్వాత ఏకంగా 70 ఎక్కువలె అనుకున్నా ఆ మార్క్ ని కూడా 16 రోజుల్లో అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి టోటల్ ట్రేడ్ కే షాక్ ఇచ్చింది ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ…
అంతటి తో ఆగకుండా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ 70 కంప్లీట్ అవ్వడం తో 80 కొలకు చేరింది, సినిమా వర్కింగ్ డేస్ లో మూడో వారం కూడా సాలిడ్ గా హోల్డ్ చేసిన తీరు చూస్తుంటే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు.
వచ్చే వారం కూడా పోటి ఇచ్చే సినిమా లేకపోవడం ఫిబ్రవరి 8 న యాత్ర సినిమా వరకు ఓపెన్ గ్రౌండ్ ఉండటం తో ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగితే 80 నుండి 85 కోట్ల లోపు ఉండే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి అందుకుంటుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.