బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, భారీ లెవల్ లో రిలీజ్ ను కూడా సొంతం చేసుకుంటూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అన్ని చోట్లా కుమ్మేస్తూ ఉండగా….
సినిమా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రేంజ్ ఓ లెవల్ లో కొనసాగుతూ ఉండగా మిగిలిన చోట్ల బుకింగ్స్ కూడా మంచి జోరుని కొనసాగిస్తున్నాయి. సినిమా ఒక్క హైదరాబాదులోనే 16 కోట్లకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా నైజాంలో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…
20 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా, ఆంధ్ర సీడెడ్ లలో కూడా కుమ్మేస్తూ ఓవరాల్ గా 36 కోట్లకు పైగా గ్రాస్ ను బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా కర్ణాటక లో 6.5 కోట్లకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద…
4 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకుంది. ఇక టోటల్ గా ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 45 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో మాస్ రచ్చ చేస్తూ 30 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రీ బుకింగ్స్ గ్రాస్ 75 కోట్లకు పైగా ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఫైనల్ బుకింగ్స్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా మొదటి రోజు మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసే అవకాశం…
ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక సినిమా కొన్ని చోట్ల మాస్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా…ఇక సినిమాకి పాజిటివ్ టాక్ సొంతం అయితే ఇక కలెక్షన్స్ పరంగా అన్ని చోట్లా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.