Home న్యూస్ 75 కోట్ల ఊచకోత….బీస్ట్ ఫస్ట్ డే ఊరమాస్ కలెక్షన్స్!!

75 కోట్ల ఊచకోత….బీస్ట్ ఫస్ట్ డే ఊరమాస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 550 వరకు ఫైనల్ థియేటర్స్ కౌంట్ తో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా బుకింగ్స్ మాస్టర్ మూవీ తో పోల్చితే సగానికి కన్నా కొంచం ఎక్కువగా ఉండగా తొలిరోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొద్ది వరకు గ్రోత్ ని చూపించిన సినిమా….

మొత్తం మీద మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 4 కోట్ల నుండి 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తమిళనాడు లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

32 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఉండగా ఇవి అక్కడ రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఇక కేరళలో సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో కూడా 5.50 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవచ్చు.

రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తో సినిమా 52 కోట్ల నుండి 55 కోట్ల వరకు గ్రాస్ ను అందుకునే ఛాన్స్ కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో మొత్తం మీద సినిమా మొదటి రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నప్పటికీ సినిమా మొదటి రోజు….

ఊరమాస్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో లేక కొంచం అటూ ఇటూ గా ఉంటాయో చూడాలి…. మొత్తం మీద మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో బీస్ట్ మూవీ మాస్ రాంపేజ్ చూపించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here