Home న్యూస్ 75 కోట్ల సింహాసనం మీద టిల్లు2….వర్కింగ్ డేస్ లో వీర బాదుడు!

75 కోట్ల సింహాసనం మీద టిల్లు2….వర్కింగ్ డేస్ లో వీర బాదుడు!

0

రెండు నెలలుగా అన్ సీజన్ లో చల్లబడిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న  సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బ్రేక్ ఈవెన్ ని ఆల్ రెడీ దాటేసి లాభాలలోకి ఎంటర్ అవ్వగా….

4 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 44.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక 5వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపించింది. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా…

Tillu Square 4 Days Total WW Collections

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల రేంజ్ నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ అంచనాలు మించిపొతే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది…

ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది ఇప్పుడు, ఇక వరల్డ్ వైడ్ గా సిద్హూ జొన్నలగడ్డ కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 75 కోట్ల సింహాసనంపై కూర్చోబోతుండగా 76 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను 5 రోజుల్లో ఈ సినిమా అందుకునే అవకాశం ఉంది, ఇక ఫైనల్ గా 5 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here