Home న్యూస్ 790 కోట్ల ఛావా ఓటిటి రెస్పాన్స్….అంచనాలను మించిన భీభత్సం!!

790 కోట్ల ఛావా ఓటిటి రెస్పాన్స్….అంచనాలను మించిన భీభత్సం!!

0

బాలీవుడ్ లో అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు లో ఆల్ మోస్ట్ 19 కోట్లకు పైగా గ్రాస్ తో సెన్సేషనల్..

బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 790 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోయగా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది…నెట్ ఫ్లిక్స్ లో మెయిన్ హిందీ వర్షన్ తో పాటు…

తెలుగు డబ్ వర్షన్ కూడా రిలీజ్ అవ్వగా…ఇప్పుడు డిజిటల్ లో సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో ఇప్పుడు డిజిటల్ లో కూడా సినిమాకి…

ఆడియన్స్ నుండి అనుకున్న దానికి మించి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమాలో విక్కీ కౌశల్ యాక్టింగ్ కి ప్రతీ ఒక్కరు ఫిదా అవ్వగా సెకెండ్ ఆఫ్ లో వచ్చే వార్ సీన్స్ అలాగే ప్రీ క్లైమాక్స్ నుండి..

క్లైమాక్స్ వరకు డైరెక్టర్ సినిమాను మలచిన తీరు అద్బుతం అని చెప్పాలి. క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం తో సినిమా ఓవరాల్ గా అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో ఉందని చెబుతూ ఉన్నారు..

రీసెంట్ టైంలో హిస్టారికల్ నేపధ్యంలో వచ్చిన మూవీస్ లో ఛావా సినిమా మరో లెవల్ లో మెప్పించింది అని అంటున్నారు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించిన సినిమా ఇప్పుడు డిజిటల్ లో కూడా అంచనాలను మించి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here