రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) 6 రోజుల సంక్రాంతి ఫెస్టివల్ వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత ఇప్పుడు 7వ రోజున ఫుల్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టింది సినిమా…
మొత్తం మీద లాంగ్ ఫెస్టివల్ వీక్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వడంతో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో సండే తో పోల్చితే మండే రోజున ఓవరాల్ గా 55-60% రేంజ్ కి అటూ ఇటూగా…
డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మంచి హోల్డ్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ ఉండగా అటూ ఇటూగా ఈ రోజున 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు…
ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ఉన్నా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించడంతో వరల్డ్ వైడ్ గా సినిమా 7.2-7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకవేళ సినిమా ఆఫ్ లైన్ లెక్కలు మిగిలిన రోజుల మాదిరిగా అంచనాలను మించి పోయి 8 కోట్ల దాకా…
వెళితే సినిమా రిమార్కబుల్ జోరుని చూపించింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డే లో మంచి హోల్డ్ నే చూపించిన సినిమా లాంగ్ రన్ లో సాలిడ్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా మొదటి వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.