బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ టాలీవుడ్ లో మంచి స్టార్ట్ లభించినా కూడా తర్వాత మాత్రం అనుకున్న రేంజ్ లో సినిమాలు పకడపోవడం, సమ్మర్ మొత్తం కూడా ఎలక్షన్స్ అలాగే IPL ఇంపాక్ట్ వలన ఏమాత్రం జోరు లేకుండా పోవడంతో టాలీవుడ్ లో అసలు మంచి సినిమాలే కరువు అయ్యాయి. ఇక హిట్ కొట్టడం అన్నది కూడా చాలా సినిమాలకు కష్టం అయ్యింది…
మొత్తం మీద మార్చ్ ఎండ్ లో వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ టాలీవుడ్ లో ఈ ఇయర్ లాస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాలను సొంతం చేసుకోలేక పోయాయి…మధ్యలో భజే వాయు వేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు….
ఎలాగోలా బిజినెస్ లను రికవరీ చేసి బ్రేక్ ఈవెన్ ని దాటి లాభాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో రిలీజ్ అయిన రోజే మిక్సుడ్ టాక్ ను అందుకుని వీకెండ్ లో మంచి జోరునే చూపించి రెండో వీక్ లో కొత్త సినిమాలు ఉన్నా కూడా వాటికి తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ అయిన మనమే…
స్టడీగా లిమిటెడ్ కలెక్షన్స్ తోనే అయినా సరి 15 రోజుల రన్ ని పూర్తి చేసుకుని బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి ఇప్పుడు లాభాలలోకి ఎంటర్ అయ్యింది. ఆల్ మోస్ట్ టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయిన 85 రోజుల గ్యాప్ లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేసిన ఒకే ఒక్క మూవీ మనమే అని చెప్పాలి.
మొదటి రోజు మిక్సుడ్ టాక్ దృశ్యా సినిమా తేరుకునే అవకాశం కొంచం తక్కువే అనిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రెండో వీకెండ్ వరకు సినిమాను భాగానే ఆదరించి ఎలాగోలా హిట్ చేశారు. దాంతో ఒకే ఒక జీవితంతో ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేసిన శర్వాకి ఈ సినిమా ఇప్పుడు మరో హిట్ గా నిలిచింది. ఇక ఈ ఇయర్ లో చాలా గట్టి విజయాలు టాలీవుడ్ కి సొంతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.