Home న్యూస్ 8 కోట్లతో 22 కోట్లు…రాజ్ తరుణ్ కెరీర్ టర్నింగ్ మూవీ ఇది!

8 కోట్లతో 22 కోట్లు…రాజ్ తరుణ్ కెరీర్ టర్నింగ్ మూవీ ఇది!

0

ఉయ్యాల జంపాల సినిమా తర్వాత వెంటనే సినిమా చూపిస్తా మావా సినిమాతో బాక్ టు బాక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్ కి ఆఫర్స్ వెల్లువగా వస్తున్న టైం అది, అలాంటి టైం లో ఒప్పుకున్న సినిమాల్లో క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ గా మారి కథని అందించిన సినిమా కుమారి 21F… డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండే యూత్ ని బాగా…

అట్రాక్ట్ చేయగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసి మ్యూజిక్ తోనే సినిమా పై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసి యూత్ అంతా కచ్చితంగా సినిమా చూసి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యేలా చేశాయి. హీరోయిన్ హెబ్బ పటేల్…..

ఓవర్ నైట్ లో యంగ్ హీరోల కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోగా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ను ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా డిఫెరెంట్ గా ప్లాన్ చేయడం అది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో…

అది కూడా వర్కౌట్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది… నవంబర్ నెలని అన్ సీజన్ అంటారు, అలాంటి నెలలో ఆల్ మోస్ట్ 8 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకుని టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాలలో 12.2 కోట్లు, వరల్డ్ వైడ్ గా 14 కోట్ల షేర్ ని 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా…

ఆల్ మోస్ట్ బిజినెస్ మీద 6 కోట్ల మేర ప్రాఫిట్ ని అన్ సీజన్ అయిన నవంబర్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 6 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ సినిమా తర్వాత లెక్కకి మిక్కిలి ఆఫర్స్ ను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ మళ్ళీ సోలో హీరోగా ఈ రేంజ్ హిట్ ని అందుకోలేదు… మరి త్వరలో కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఇస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here