బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ లో పేరుకు చిన్న సినిమా అయినా కూడా బడ్జెట్ పరంగా మీడియం రేంజ్ మూవీస్ కి మించే రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ అయిన రజాకార్(Razakar Collections) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా…
మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ లాంటివి చేయకున్నా కూడా ఉన్నంతలో నైజాంలో మంచి కలెక్షన్స్ నే సాధించింది, కానీ మొత్తం మీద బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం పెద్దగ జోరు చూపించలేదు, ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ తో పోల్చితే మాత్రం పర్వాలేదు అనిపించేలా వర్కింగ్ డేస్ లో…
హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగించిన సినిమా ఓవరాల్ గా 8 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Razakar Movie 8 Days Total WW Collections
👉Nizam: 0.75CR~
👉Total AP: 0.55CR~
Total AP-TG Collections:- 1.30CR~(2.65CR~ Gross)
👉KA+ROI+OS -0.15CR
Total WW Collections – 1.45CR (3.00CR~ Gross)
మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల దాకా ఉండగా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా పెద్దగా ప్రమోషన్స్ లేక పోయినా కూడా ఆన్ సీజన్ లో పర్వాలేదు అనిపించింది, మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేసి ఉంటే కనుక ఇంకొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉండేది.
ఓవరాల్ గా బడ్జెట్ పరంగా చూసుకుంటే 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉండగా థియేట్రికల్ రిజల్ట్ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించింది. ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమా ఫైనల్ రన్ లో ఎంతవరకు వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.