బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అద్బుతంగా ముగించుకుని 29.7 కోట్ల లోపు షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రామ్ పూరీ ల ఇస్మార్ట్ శంకర్ మొదటి వారం సాలిడ్ బ్యాటింగ్ తర్వాత రెండో వారం లో అడుగు పెట్టింది. ఫస్ట్ వీక్ 670 కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగించిన ఈ సినిమా ఇప్పుడు రెండో వారంలో 360 కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది.
కాగా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి యదా విధిగా మాస్ సెంటర్స్ లో జోరు చూపిన సినిమా క్లాస్ సెంటర్స్ లో స్లో డౌన్ అయ్యింది. ఓవరాల్ ఆక్యుపెన్సీ సుమారు 12% నుండి 15% లోపు ఉందని సమాచారం. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాస్ సెంటర్స్ లో మంచి జోరు చూపి…
గ్రోత్ ని సాధించే అవకాశం ఉండటంతో 8 వ రోజున సినిమా 80 లక్షల నుండి 1 కోటి లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ బ్యాటింగ్ 8 వ రోజు కూడా సాలిడ్ గా సాగుతుందని చెప్పొచ్చు. డే ఎండ్ వరకు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.