మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఫస్ట్ వీక్ లో టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా…
ఫెస్టివల్ వీక్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా 7వ రోజు రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా..8వ రోజులో అడుగు పెట్టిన సినిమా మరోసారి వర్కింగ్ డే ని ఫేస్ చేసినా కూడా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 7వ రోజుతో పోల్చితే…
ఓవరాల్ గా డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండటం విశేషం కాగా కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ లో చాలా చోట్ల ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని నమోదు చేసిన సినిమా హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి…ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున ఇప్పుడు…
4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా…
ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది….రిమార్కబుల్ హోల్డ్ తో దూసుకు పోతున్న సినిమా ఇక టోటల్ గా 8 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.