Home న్యూస్ 8వ సారి 1M….చరిత్రలో ఒకే ఒక్కడు సామి!!

8వ సారి 1M….చరిత్రలో ఒకే ఒక్కడు సామి!!

0

యూట్యూబ్ రికార్డుల విషయంలో సౌత్ లో మరే హీరోకి కూడా సాధ్యం కాని రేంజ్ లో ఒక్క హీరో సినిమా నుండి పాట వచ్చినా టీసర్, ట్రైలర్ ఏది వచ్చినా కూడా అవి యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతూ ఉంటాయి. మిగిలిన సౌత్ హీరోలు అందరూ కూడా ప్రస్తుతానికి ఈ హీరో తో పోల్చితే రేసులో వెనకే ఉన్నారు…

ఆ హీరోనే కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)…త్వరలో పాలిటిక్స్ లో బిజీ అవ్వబోతున్న ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ నుండి ఫస్ట్ సాంగ్ విజిల్ పోడు(WhistlePodu Song) రిలీజ్ అవ్వగా విజయ్ రీసెంట్ సినిమాల పాటలతో పోల్చితే ఈ పాటకి యునానిమాస్ రెస్పాన్స్ ఏమి రాలేదు కానీ…

ఉన్నంతలో పాటకి రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా వచ్చినా యూట్యూబ్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ తోనే దూసుకు పోతుంది… కాగా పాట విజయ్ కెరీర్ లో మరో 1 మిలియన్ లైక్స్ మార్క్ ని 24 గంటల లోపే అందుకున్న సాంగ్ గా సంచలనం సృష్టించింది… ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో ఇది వరకు కుట్టి స్టోరీ, బీస్ట్ మోడ్….

బాడ్ ఆస్ మాన్, రంజితమే, జాలీ ఓ జింకానా, నా రెడీ మరియు అరబిక్ కుత్తు పాటలు రిలీజ్ అయిన 24 గంటల లోపే 1 మిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ నుండి విజిల్ పోడు సాంగ్ 8 వ 1 మిలియన్ మార్క్ లైక్స్ ని అందుకున్న సాంగ్ గా రికార్డ్ కొట్టింది…

కోలివుడ్ లోనే కాదు టోటల్ సౌత్ లోనే ఇలా 8 సార్లు 1 మిలియన్ మార్క్ ని 24 గంటల లోపే అందుకున్న హీరో గా విజయ్ రికార్డ్ కొట్టగా మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా దరిదాపుల్లో కూడా లేరు. ఇక ఈ సినిమా నుండి వచ్చే ఇతర పాటలు కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే ఈ మార్జిన్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here