బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు నుండి 8 రోజుల పాటు ఎలాంటి పోటి లేకుండా అల్టిమేట్ వసూళ్ళ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయింది. సినిమా 30 కోట్లకి పైగా షేర్ 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసి సత్తా చాటుకుంది. కానీ 9 వ రోజున సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ నుండి పోటి ఎదురు అయింది.
థియేటర్స్ తగ్గడం పోటి లో కొత్త సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం తో 8 రోజుల అల్టిమేట్ డామినేషన్ కి కొంత వరకు బ్రేక్ పడినట్లు అయింది. సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1 కోటి రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన విషయం తెలిసిందే.
కాగా 9 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి 8 వ రోజు తో పోల్చితే 50% వరకు డ్రాప్స్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్లాస్ సెంటర్స్ లో డ్రాప్స్ 60% కి పైగా ఉన్నాయి. దాంతో 8 రోజుల తర్వాత భారీ డ్రాప్స్ ని ఇప్పుడే సొంతం చేసుకుంది సినిమా.
కానీ మాస్ సెంటర్స్ లో తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ని సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి సినిమా తొలి 2 షోల ఓపెనింగ్స్ ని బట్టి చూస్తె 9 వ రోజున 40 లక్షల నుండి 50 లక్షల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అనుకున్న రేంజ్ గ్రోత్ ని సాధిస్తే 50 లక్షల నుండి 60 లక్షల లోపు షేర్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి సినిమా 9 వ రోజు ముగిసే సరికి ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.