Home న్యూస్ ఇదే ఫైనల్…డియర్ కామ్రేడ్ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్…డియర్ కామ్రేడ్ ఫైనల్ టాక్ ఇదే!!

0

     వరల్డ్ వైడ్ గా 1500 కి పైగా థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల తర్వాత ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసు కుంది, ఇక తొలి 2 షోల కి సినిమా కి లోకల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ దక్కింది.

ఇక ఈవినింగ్ షోలకు భారీ గా తరలి వచ్చే రెగ్యులర్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చాలా స్లో గా ఉందని కంప్లైంట్ చేస్తున్నా కానీ సినిమాలో ఉన్న…

మేజర్ ప్రాబ్లం ని చూపెట్టి బయట ఇలాంటివి ఆగేందుకు మరింత అవకాశం ఉండేలా ప్రచారం చేయడం బాగుందని, దాంతో పాటు విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు. వారి నుండి ఫైనల్ గా సినిమా ఎబో యావరేజ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం…

సినిమాలో చాలా మైనస్ లను వెతుకుతూ సినిమా చాలా స్లో గా ఉందని, అసలు లెంత్ మరీ ఎక్కువ అయిందని, అంతలా ఎమోషనల్ సీన్స్ పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. విజయ్- రష్మిక ల పెర్ఫార్మెన్స్ ఒకటి రెండు పాటలు కొన్ని సీన్స్ తప్పితే సినిమా మొత్తం ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు.

ఫైనల్ గా సినిమాకి వారి నుండి వినిపిస్తున్న టాక్ యావరేజ్ గా ఉందని చెప్పొచ్చు. టోటల్ అన్ని షోల టాక్ లను కలిపి చూస్తె మరీ సినిమాను ఎవరు తీసి పారేయడం లేదు… యావరేజ్ టు ఎబో యావరేజ్ అని చెబుతున్నారు కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here