సంక్రాంతి సినిమాల సందడి చివరి పెద్ద రోజు కి వచ్చేసింది… ఈ ఆదివారం అన్ని సినిమాలకు చివరి పెద్ద రోజు గా చెప్పుకోవచ్చు. ఈ ఆదివారం తర్వాత అన్ని సినిమాలు కొద్దిగా స్లో అవ్వడం ఖాయం.. ఇక ఉన్న సినిమాలలో ఈ రోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకోవచ్చు అన్న విషయాలను గమనిస్తే… ముందుగా సూపర్ స్టార్ రజినీ దర్బార్ స్లో డౌన్ అవ్వడం విచారకరం అని చెప్పాలి.
మిగిలిన సినిమాలకు పోటి ఇవ్వలేక పోతున్న ఈ సినిమా ఈ రోజు 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా అల్టిమేట్ హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకుపోతుంది. ఈ రోజు కూడా సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరో సారి 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క 7.2 కోట్ల నుండి 7.5 కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సెన్సేషనల్ డే ని ఎంజాయ్ చేస్తుంది.
ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్నీ అనుకున్నట్లు ఉంటె లెక్క 8.5 కోట్ల కి పైగా వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా… స్లో అవుతుంది అనుకుంటే…
డీసెంట్ కలెక్షన్స్ ని సాధిస్తూ స్టడీ గానే ఉంది, ఇక ఈ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల కి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద అన్ని సినిమాల అఫీషియల్ ఆదివారం కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం…