Home న్యూస్ సంక్రాంతి టాప్ 5 మూవీస్… సరిలేరు నీకెవ్వరు -అల వైకుంఠ పురంలో న్యూ రికార్డ్!!

సంక్రాంతి టాప్ 5 మూవీస్… సరిలేరు నీకెవ్వరు -అల వైకుంఠ పురంలో న్యూ రికార్డ్!!

0

     టాలీవుడ్ కి క్యాలెండర్ ఇయర్ లో బెస్ట్ సీజన్ ఫర్ మూవీస్ ఏది అంటే సమ్మర్ అని చెప్పాలి… సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ ఓ రేంజ్ లో ఉండే సీజన్ అది.. కానీ రీసెంట్ టైం లో సమ్మర్ కి మించి సంక్రాంతి సీజన్ వారం 10 రోజులు ఊచకోత కోసే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకుపోతుంది. గత కొన్నేళ్ళ లో సీజన్ సీజన్ కి కలెక్షన్స్…

ఓ రేంజ్ లో పెరిగి పోతూ దూసుకు పోతున్నాయి… రీసెంట్ టైం లో అన్ని సీజన్స్ లోకి 2017 ఇయర్ సీజన్ బెస్ట్ గా చెప్పుకోవాలి. ఆ సీజన్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్ని సక్సెస్ అవ్వడమే కాకుండా అందరు హీరోల కి కెరీర్ బెస్ట్ రికార్డులను కూడా ఇచ్చాయి.

ఇక 2018 సంక్రాంతి సీజన్ పెద్దగా కలిసి రాలేదు, 2019 లో కూడా ఎఫ్ 2 ఒక్కటే దుమ్ము లేపింది. దాంతో 2020 సంక్రాంతి సీజన్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ కి తోడూ 2 సినిమాల మధ్య పోటి తీవ్రం అవ్వగా ఇప్పుడు 2 కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సంక్రాంతి సీజన్ రికార్డులు తిరగరాశాయి.

ఒకసారి సంక్రాంతి సీజన్స్ లో టాప్ 5 షేర్ వసూల్ చేసిన సినిమాలను గమనిస్తే
1. #AlaVaikunthapurramuloo: 110.70Cr(7 Days)**
2. #SarileruNeekevvaru: 109.77Cr(8 Days)**
3. #Khaidino150: 104.6Cr
4. #F2: 84.51Cr
5. #VinayaVidheyaRama: 63.40Cr
ఇవీ మొత్తం మీద సంక్రాంతి సీజన్స్ మూవీస్ లో అత్యధిక షేర్ ని సాధించిన టాప్ 5 సినిమాలు. అల వైకుంఠ పురం లో ఒకరోజు లేట్ గా వచ్చినా…

సెన్సేషనల్ కలెక్షన్స్ తో సరిలేరు నీకెవ్వరు 8 రోజుల కలెక్షన్స్ ని బీట్ చేసి ప్రస్తుతం సంక్రాంతి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలు కూడా లాంగ్ రన్ పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు. దాంతో వచ్చే సీజన్స్ లో బెంచ్ మార్క్ మరింత భారీ గా ఉండబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here