టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మొదటి వారంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ రెడీ మంచి గ్రోత్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో టికెట్ హైక్స్ తగ్గడంతో సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది…
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 8వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగానే ఉండటంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే మొత్తం మీద 1.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, వరల్డ్ వైడ్ గా సినిమా 1.9 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 9 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి.