ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న విరూపాక్ష సినిమా రెండో వారంలో అడుగు పెట్టిన తర్వాత ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు కోటి కి పైగా షేర్ ని మరోసారి అందుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా ఇప్పుడు 9వ రోజున…
తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 20-30% రేంజ్ లో గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కొన్ని చోట్ల మించి పోయే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు…
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 9 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.