బాలీవుడ్ లో రీసెంట్ గా టాక్ ఎలా ఉన్నా కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో సినిమాలు జనాలను థియేటర్స్ కి రప్పిస్తూ ఉండగా ట్రైలర్ తో మంచి బజ్ ను సొంతం చేసుకున్న అజయ్ దేవగన్(Ajay Devgn) ఆర్ మాధవన్(R Madhavan) ల కాంబినేషన్ లో వచ్చిన సైతాన్(Shaitaan Movie Telugu Review) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది…
శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మరాఠీ లో వచ్చిన వష్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది…. సినిమా కథ పాయింట్ కి వస్తే….తన భార్య కూతురుతో కలిసి ఉండే హీరో ఇంట్లోకి సడెన్ గా ఒకరోజు ఆర్ మాధవన్ వస్తాడు….ఎంత చెప్పినా ఇంటి నుండి బయటికి వెళ్ళడు….ఆర్ మాధవన్ మనుషులను తన వశీకరణంతో…
తనకి నచ్చిన పనులు చేయించుకునే ఎక్స్ పెర్ట్…. ఇంట్లోకి వచ్చాక హీరో కూతురుని తన వశీకరణ విద్యతో తన ఆధీనంలోకి తీసుకుంటాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఒరిజినల్ వర్షన్ లో డార్క్ ఎలిమెంట్స్ ను చాలా బాగా చూపించి హర్రర్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ లో ట్రీట్ మెంట్ ఉంటుంది…
కానీ రీమేక్ లో కొంచం డోస్ ను తగ్గించగా ఒరిజినల్ చూడని వాళ్ళకి బాగానే నచ్చే అవకాశం ఉండగా ఒరిజినల్ చూసిన వాళ్ళకి పర్వాలేదు అనిపించేలా ఉండగా చూడని వాళ్ళకి మాత్రం సినిమా చాలా కొత్తగా అనిపించడం ఖాయం…ఆర్ మాధవన్ తన నటనతో సినిమాను మరో లెవల్ కి తీసుకు వెళ్ళాడు…
కానీ కొన్ని సీన్స్ పదే పదే రిపీట్ అవ్వడం, ఎండింగ్ కొంచం వీక్ గా అనిపించడం లాంటివి చిన్న డ్రా బ్యాక్స్ అయినా కూడా సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా ఇలాంటి హర్రర్ అండ్ థ్రిల్లర్ నేపధ్యంలో సినిమాలు ఇష్టపడే వారికి సైతాన్ మూవీ చాలా వరకు నచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.