బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి బాగానే రప్పిస్తుంది అనుకున్నారు కానీ మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ వలన సినిమా అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను అయితే అందుకోలేక పోయింది.
ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపించడం లేదు, తమిళనాడులో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా తెలుగు లో మాత్రం సినిమా మరింతగా స్లో అయింది….డే 2 తో పోల్చితే డే 3 గ్రోత్ ఉండాల్సిన చోట సినిమా డే 2 కి సిమిలర్ గా కొన్ని చోట్ల…
కొన్ని చోట్ల డ్రాప్స్ ఉండగా మొత్తం మీద మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 55-60 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం అయితే ఉంది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్…
సరిపోవు అనే చెప్పాలి. ఇక మొత్తం మీద తమిళ్ లో సినిమా మూడో రోజు మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపిస్తున్నా కూడా ఓవరాల్ గా మరీ అంచనాలను అయితే అందుకోవడం లేదు…. ఓవరాల్ గా 3వ రోజు అక్కడ సినిమా మరోసారి 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా వీక్ వీకెండ్ కలెక్షన్స్ ని…
అందుకోబోతుండగా వర్కింగ్ డేస్ లో సాలిడ్ హోల్డ్ ని చూపిస్తే తప్పితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకునే అవకాశం తక్కువే అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా వీకెండ్ లో టోటల్ గా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఇలానే ఉంటాయా ఏమైనా గ్రోత్ ని చూపిస్తాయో చూడాలి ఇక…