బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా, రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి కూడా ఓవరాల్ గా 100 కోట్ల మార్క్ కోసం…
ఇంకా కష్టపడాల్సిన అవసరం ఏర్పడగా…సినిమా బడ్జెట్ దృశ్యా కానీ బిజినెస్ దృశ్యా కానీ కోలివుడ్ హిస్టరీలోనే ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలవబోతుంది. కానీ సినిమా నిర్మాతల స్టేట్ మెంట్స్ మాత్రం విచిత్రంగా ఉన్నాయి. రిలీజ్ కి ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ మూవీ…
2000 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చారు…రిలీజ్ తర్వాత మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత, థియేటర్ ఓనర్స్ ని సౌండ్ తగ్గించుకొండి అంటూ, లాగ్ సీన్స్ ను ఎడిట్ చేయం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి మొత్తానికే ఎఫెక్ట్ అయ్యాక వర్కింగ్ డేస్ లో రీ ఎడిట్ వర్షన్ ను రిలీజ్ చేశారు..
అయినా కూడా సినిమాకి అప్పటికే డ్యామేజ్ జరిగిపోవడంతో సినిమా తేరుకోలేక పోయింది. ఇక రీసెంట్ గా సినిమా కో ప్రొడ్యూసర్ అయిన ధనంజేయన్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అంచనాలను అందుకోకపోవడానికి కారణం రెండు హీరోల ఫ్యాన్ డమ్స్ అని అలాగే…
2 పొలిటికల్ పార్టీలు కలిసి సినిమా మీద కుట్ర చేశారని, అందుకునే సినిమాకి ఇలాంటి రిజల్ట్ వచించి అని స్టేట్ మెంట్ ఇచ్చారు.. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అంటే తమిళనాడులో విజయ్ అజిత్ ల ఫ్యాన్స్ అని అంటూ ఉండగా వీళ్ళ టార్గెట్ వలన సినిమా అక్కడ దెబ్బ పడితే….
మరి మిగిలిన చోట్ల సినిమాకి రెస్పాన్స్ ఎందుకని అనుకున్న విధంగా లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా రిజల్ట్ ను యాక్సెప్ట్ చేయకుండా రివర్స్ లో వీళ్ళ వల్ల ఫ్లాఫ్ అయింది, వాళ్ళ వల్ల ఫ్లాఫ్ అయింది అంటూ రివర్స్ అవ్వడం వలన నిర్మాతల కామెంట్స్ చూసి సినిమాను మరింతగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో….