బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన పెద్ద సినిమాలు చిన్న సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ సొంతం అవుతూ ఉంటాయి…కానీ ఇండియన్ మూవీస్ లో ఏ సినిమాకి కూడా జరగని రేంజ్ లో ఆల్ టైం హిస్టారికల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాకి బిజినెస్ ను రికవరీ చేయడమే ఎవరెస్ట్ అంత టార్గెట్…
అలాంటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మాత్రం ఆ మమ్మోత్ బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేయడమే కాదు ఇప్పుడు లాభాల పరంగా కూడా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది…
ఇండియన్ మూవీస్ లో ఏ సినిమా కూడా సొంతం చేసుకోలేని రేంజ్ లో 617 కోట్ల ఎపిక్ మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 736 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా…
19 వ రోజున సాధించిన కలెక్షన్స్ తో మినిమమ్ 742 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుంది…దాంతో ఓవరాల్ గా సినిమా సాధించిన మమ్మోత్ 617 కోట్ల బిజినెస్ మీద సినిమా ఏకంగా 125 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని సంచలనం సృష్టించింది ఇప్పుడు….
టాలీవుడ్ నుండి ఇది వరకు కూడా 125 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకున్న సినిమాలు ఉన్నాయి కానీ ఇండియన్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని…ఆ బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేయడమే కాకుండా ఇప్పుడు…
ఆ బిజినెస్ మీద 125 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊచకోత కోయడం అంటే మామూలు విషయం కాదు, మేజర్ ప్రాఫిట్ హిందీ నుండే వచ్చినా కూడా ఓవరాల్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతున్న పుష్ప2 ఇక మిగిలిన రన్ లో ఎంత లాభాన్ని పెంచుకుంటుందో చూడాలి.