Home న్యూస్ గేమ్ చేంజర్ మూవీ తమిళనాడు బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

గేమ్ చేంజర్ మూవీ తమిళనాడు బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

ఆర్ ఆర్ ఆర్ లాంటి ఎపిక్ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య తో డిసాస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా సోలో హీరోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా భారీ లెవల్ లో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే..

సినిమా మీద ఆల్ రెడీ మంచి అంచనాలు ఉండగా సంక్రాంతికి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంటే కచ్చితంగా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ బిజినెస్ పరంగా కూడా రచ్చ చేయడం మొదలు పెట్టిన…

గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు తమిళనాడులో బిజినెస్ డీల్ ను క్లోజ్ చేసుకుంది ఇప్పుడు. అక్కడ టాప్ డైరెక్టర్స్ లో ముందు నిలిచే శంకర్ డైరెక్షన్ లో సినిమా అవ్వడం, రామ్ చరణ్ కి కూడా డీసెంట్ ఫాలోయింగ్ ఉండటంతో మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమా కి…

తమిళనాడులో మంచి రేటు సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది….పోటిలో అజిత్ కుమార్ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నా కూడా గేమ్ చేంజర్ మూవీ కి ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ డీల్ సొంతం అయ్యింది…

ఇక సినిమా తమిళనాడులో క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 34-36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ తమిళనాడులో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాడో…

ఆర్ ఆర్ ఆర్ తర్వాత సోలో హీరోగా తన మార్కెట్ రేంజ్ ని ఎంతవరకు పెంచుకుంటాడో చూడాలి…శంకర్ రీసెంట్ మూవీస్ లా కాకుండా ఒకప్పటి మూవీస్ ని మరిపించే రేంజ్ లో మినిమమ్ ఇంపాక్ట్ చూపించినా కూడా గేమ్ చేంజర్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here