Home న్యూస్ బచ్చల మల్లి 5 డేస్ కలెక్షన్స్….పాపం అల్లరి నరేష్!!

బచ్చల మల్లి 5 డేస్ కలెక్షన్స్….పాపం అల్లరి నరేష్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన అల్లరి నరేష్(Allari Naresh) నటించిన బచ్చల మల్లి(Bachhala Malli Movie) సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది…సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో…

పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోవడంతో బాక్స్ అఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది. మొత్తం మీద 2 రోజుల్లో సినిమా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా మూడో రోజు 45 లక్షల రేంజ్ లో….

నాలుగో రోజు వర్కింగ్ డే లో 30 లక్షల రేంజ్ లో 5వ రోజున 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 5 రోజులు పూర్తి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్నట్లు అంచనా…ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి సినిమా ఓవరాల్ గా 20 లక్షలకు పైగా గ్రాస్ ను అందుకోగా 10 లక్షల లోపు షేర్ ని అందుకోగా…ఓవరాల్ గా సినిమా 5 రోజులు…

పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 2.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…

సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా ఉండగా అల్లరి నరేష్ కి మరోసారి నిరాశనే ఈ సినిమా మిగిలించబోతుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here