బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ నెలలో రెండు మూడు సినిమాలు అన్నా కూడా మినిమమ్ లో మినిమమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత ఇంపాక్ట్ ను చూపిస్తూ ఉంటాయి…కానీ ఈ నెల డిసెంబర్ లో మాత్రం టాలీవుడ్ లో కంప్లీట్ గా వన్ వే లో వెళ్ళిపోయింది….ఆ వన్ వే ని అడ్డుకోవాలని చూసిన ఒక్క సినిమా కూడా అసలు తేరుకోలేక పోయింది ఇప్పుడు…
ఆ సినిమానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూవీ….రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో కంప్లీట్ గా…
వన్ వే లో డామినేట్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమా హవా కొద్ది వరకు ఉంది, కర్ణాటకలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తర్వాత అక్కడ మూవీస్ ఇంపాక్ట్ వలన కొంచం స్లో అయినా కూడా…
లోకల్ బిగ్ మూవీస్ ఏవి కూడా పుష్ప2 రేంజ్ కలెక్షన్స్ ని అయితే అందుకోలేక పోయాయి అనే చెప్పాలి. అదే టైంలో తమిళనాడులో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా ఇతర సినిమాలు రావాడంతో కొంచం స్లో అయ్యింది…కేరళలో ఓపెనింగ్స్ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేదు…
కానీ ఓవరాల్ గా డిసెంబర్ నెలలో టాలీవుడ్ తరుపున రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలోకీ హిట్ అయిన ఒకే ఒక్క సినిమాగా నిలిచింది పుష్ప2 మూవీ, అదే విధంగా హిందీ లో కూడా హిట్ అయిన ఒకే సినిమాగా నిలిచిన పుష్ప2 మూవీ…ఒక 5-6 పెద్ద సినిమాలు…
అక్కడ లైఫ్ టైంలో సాధించే రేంజ్ యావరేజ్ కలెక్షన్స్ ని ఒక్క సినిమాతోనే సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ తో మాస్ ఊచకోత కోసి డిసెంబర్ నెల ఆల్ టైం టాపర్ గా నిలిచింది. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఎంతవరకు వసూళ్ళని అందుకుంటుందో చూడాలి….