బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) పుట్టిన రోజు కానుకగా ఆర్య2(Arya2 Movie Re Release) మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా సినిమా ఎక్స్ లెంట్ టికెట్ సేల్స్ అండ్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసింది. సినిమా రిలీజ్ రోజు వరకు 140K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయగా…
రెండో రోజున 20 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 2 రోజుల్లో 4.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా…వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత 3-4 రోజుల్లో 10 వేలకి తగ్గని టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా..
5వ రోజున కూడా 4 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో మంచి జోరు ని చూపించింది. మొత్తం మీద మిగిలిన 3 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ జోరు చూపించింది.
మొత్తం మీద సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Arya2 Re Release 5 Days WW Collections
👉Nizam – 2.80CR~
👉Ceeded – 50L
👉Andhra – 2.30CR~
AP-TG Total – 5.60CR~ GROSS
👉KA+ROI+OS- 80L***Approx
Total World Wide Collections: 6.40CR~ Gross
మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన ఆర్య2 మూవీ ఓవరాల్ గా 185K రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. అలాగే అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుని రికార్డ్ కొట్టింది.