నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 118 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో మొత్తం మీద 3.3 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా మూడో రోజు ఆదివారం అవ్వడం తో సినిమా సాలిడ్ గ్రోత్ ని సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని పూర్తిగా ట్రాక్ చేయలేక పోయాం కానీ సినిమా అనుకున్న లెవల్ లో మించి కలెక్షన్స్ ని…
మూడో రోజు అందుకుని సత్తా చాటింది, తక్కువ లో తక్కువ సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల రేంజ్ ని అందుకునే అవకాశం ఉందీ అనుకున్నా కానీ సినిమా సాలిడ్ గ్రోత్ ని సాదించి నైజాం లో 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపింది.
మిగిలిన ఏరియాల్లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా మొత్తంగా ఇప్పుడు మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 1.5 కోట్ల రేంజ్ కి తగ్గకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా లెక్క పెరిగి 1.7 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా మొత్తాన్ని సినిమా మొదటి మూడు రోజుల వీకెండ్ లోనే అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా నాలుగో రోజు…
కూడా మహా శివరాత్రి హాలిడే ఉండటం తో ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే కచ్చితంగా మరింత కలెక్షన్స్ తో బిజినెస్ కి దగ్గర అయ్యే అవకాశం ఉంది, ఇక మూడు రోజుల అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
The collections to the movie 118 will further
boost the imagine and film career of N.KalyanRam.
Wish the team win the race of success.