యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా 1500 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ప్రీమియర్ షోలతో ఎబో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందొ తెలుసు కుందాం పదండీ…
కథ: విప్లవ భావాలు ఉన్న యూత్ లీడర్ విజయ్…తన అగ్రెసివ్ నేచర్ తో గొడవల్లో ఎక్కువగా పాల్గొంటాడు, అలాంటి హీరోకి అనుకోకుండా రష్మిక తో పరిచయం ఆ తర్వాత ప్రేమ లో పడటంతో హీరోయిన్ కోపాన్ని తగ్గించుకోమని హీరో కి చెబుతుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వీరు విడిపోవాల్సి వస్తుంది. తిరిగి వీరు ఎలా కలిసారు, హీరోయిన్ కెరీర్ కి ఒక కామ్రేడ్ లా హీరో అండగా నిలిచాడు అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: కథగా చెప్పడానికి సింగిల్ లైన్ లో చెప్పేదిగానే ఉన్నా, రియలస్టిక్ వే లో డైరెక్టర్ భరత్ కమ్మ సినిమా ను నడిపించాడు. దాంతో కథ మనతో ట్రావెల్ అవుతుంది అనిపించినా అది చాలా స్లో గా ట్రావెల్ అవ్వడం వలన ఎక్కువ సార్లు బోర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ విషయం లో ఇది మరింతగా ఎక్కువగా అనిపిస్తుంది.
ఫస్టాఫ్ వరకు హీరో హీరోయిన్స్ పరిచయం, హీరోయిన్ గోల్ ఏంటో చూపెట్టిన డైరెక్టర్ పాటల రూపంలో ఇద్దరి ప్రేమ ని బాగా చూపెట్టాడు. ఇక సెకెండ్ ఆఫ్ లో హీరోయిన్ ఎదురుకున్న కష్టాలను హీరో ఎలా తీర్చాడు అన్న విషయాలను చెప్పడానికి సమయం ఎక్కువగా తీసుకోవడం తో చాలా సీన్లు నీరసంగా అనిపించింది.
పాటలు వినడానికి యావరేజ్ గా అనిపించినా చూడటానికి మాత్రం విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. సినిమా ని మరింతగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. డైరెక్టర్ గా భరత్ కమ్మ సినిమా లో చాలా భాగం సక్సెస్ అయినప్పటికీ అదే సమయంలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి విఫలం కూడా అయ్యాడు.
అదే సమయంలో యాక్టర్స్ అయిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక లు తమ పెర్ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టారు, ఇద్దరు పోటి పడి మరీ నటించారు. సెకెండ్ ఆఫ్ లో రష్మిక నటన చాల బాగుందని చెప్పొచ్చు. విజయ్ ఎప్పటిలానే ఎంతో ఈజ్ తో స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఓవరాల్ గా సినిమాలో ప్లస్ పాయింట్స్ విషాయానికి వస్తే లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్, మూడు పాటలు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పొచ్చు.. అదే సమయంలో మైనస్ ల విషయానికి వస్తే లెంత్, స్లో నరేషన్, హెవీ ఎమోషనల్ సీన్స్ మేజర్ మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
అయినా కానీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ ఇష్యూ ను సెన్సిటివ్ వె లో కన్వే చేసి దర్శకుడు చేసిన ప్రయత్నానికి హీరో అండ్ హీరోయిన్ అందించిన సహకారాన్ని మేచ్చుకోవాల్సిందే. ఓవరాల్ గా సినిమా లో ఆ పాయింట్ ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అన్న దాని పై సినిమా విజయం ఆధారపడి ఉంది.
ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…యూత్ కి, ఫ్యాన్స్ కి సినిమా చాలా వరకు నచ్చే అవకాశం ఉంది, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. కానీ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసే వారికి ఎంతవరకు నచ్చుతుంది అనేది ప్రస్తుతానికి డౌట్… వాళ్ళ కి కూడా నచ్చితే సినిమా సేఫ్ అయినట్లే లెక్క…