ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 9.68 కోట్ల షేర్ ని వసూల్ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టపడాల్సి వస్తుంది, క్లాస్ కంటెంట్ మరీ ఎక్కువ అయినా కష్టమే అని తెలుసుకుని సినిమా లెంత్ ని 16 నిమిషాలు ట్రిమ్ చేశారు, కానీ అది డే ఎండ్ కి చెప్పడంతో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రదర్శన కొంచం నిరాశ పరిచింది అని చెప్పొచ్చు.
సినిమా బిజినెస్ 34.6 కోట్లు అవ్వడంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 35.6 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రెండో రోజు ఎంత లేదన్నా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల తో పోల్చితే ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంచం గ్రోత్ ని అందుకుంది కానీ మరీ ఆశించిన స్థాయి లో అయితే లేదనే చెప్పాలి, ఇక మాస్ సెంటర్స్ లో మాత్రం డే ని ఎలా స్టార్ చేసిందో అలాగే ఉండిపోయింది.
దాంతో నైట్ షోలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ భారీ లెవల్ లో ఉంటే తప్పితే సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి 4 కోట్ల లోపే షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఒకవేళ గ్రోత్ అనుకున్న లెవల్ లో ఉంటే 4 కోట్లకు పైగా షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, మొత్తం మీద రెండు జరిగినా బిజినెస్ కి న్యాయం చేసే లెవల్ లో…
అయితే సినిమా కలెక్షన్స్ ని అందుకోలేదనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా 5 కోట్ల లోపు షేర్ ని 2 వ రోజునే అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి నిర్మాతలు మొదటి రోజే 11.14 కోట్ల రేంజ్ షేర్ ని అనౌన్స్ చేశారు, 2 రోజులు కలిపి ఎంత అనౌన్స్ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.