బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో తొలి సారిగా అల్ట్రా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా రాక్షసుడు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో ఆల్ మోస్ట్ 6.5 కోట్ల లోపు షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది, ఇక సినిమా 4 వ రోజు తొలి అఫీషియల్ వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా ఎలాంటి కలెక్షన్స్ తో రోజును ఎలా ముగించింది అన్నది ఆసక్తి కరంగా మారింది.
కాగా సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 3 వ రోజు తో పోల్చితే 50 నుండి 55% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, క్లాస్ సెంటర్స్ లో బాగానే ఉన్నా కానీ మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల…
విషయానికి వచ్చే సరికి సినిమా మంచి గ్రోత్ నే సాధించి డ్రాప్స్ ని 10% వరకు తగ్గించింది. దాంతో మొత్తం మీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఆక్యుపెన్సీ 50% కి పైగానే ఉందని చెప్పొచ్చు. అది 60% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే…
మొత్తం మీద అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ లెక్కకు మించి ఉంటే ఈ లెక్క 1.4 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సండే నుండి మండే కి 45% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది అంటే…
సినిమా బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఇదే జోరు మిగిలిన వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగితే సినిమా బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక 4 రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.