Home న్యూస్ పహిల్వాన్ రివ్యూ-రేటింగ్…ప్లస్&మైనస్ పాయింట్స్!!

పహిల్వాన్ రివ్యూ-రేటింగ్…ప్లస్&మైనస్ పాయింట్స్!!

0

      కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కి తెలుగు లో కూడా మంచి పేరు ఉంది, ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పైల్వాన్ కన్నడ తో పాటు తెలుగు హిందీ తమిళ్ ఇలా ఇండియా లో 9 భాషల్లో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే… అనాధ అయిన హీరో లో ఉన్న ఇతరుల కోసం పోరాడే శక్తిని కుస్తీ రూపంలో చూపి నేషనల్ చాంపియన్ ని చేయాలనీ…

ఇండియా కి మెడల్ తీసుకు రావాలని కోరుకునే కుస్తీ మాస్టర్ సర్కార్ కలని హీరో నేరవేర్చాడా లేదా అన్నది ఓవరాల్ స్టొరీ పాయింట్. అవడానికి ఇది మెయిన్ పాయింట్ అయినా సినిమా లో నాలుగైదు ఉప కథలు ఉంటాయి… విచిత్రం ఏంటి అంటే మెయిన్ పాయింట్ కాకుండా…

ఈ ఉపకతలతోనే సినిమా పూర్తీ అవుతుంది. హీరోగా సుదీప్ బాగా చేశాడు, యాక్షన్ సీన్స్ కుస్తీ సీన్స్ లో తన కష్టం ప్రతీ చోటా కనిపిస్తుంది, ఇక సర్కార్ గా సునీల్ శెట్టి ఆకట్టుకోగా హీరోయిన్ ఆకాంశ సింగ్ కూడా మెప్పిస్తుంది. సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.

ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, సినిమా లెంత్ చాలా ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నుయి. డైరెక్షన్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కానీ ప్రతీ సీన్ ని ఆడియన్స్ యిట్టె చెప్పగలిగేలా ఉండటం, కథ చాలా వరకు సుల్తాన్ నుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది.

ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… సుదీప్ ఆకట్టుకోవడం, కొన్ని ఫైట్ సీన్స్ బాగుండటం, హీరో మరియు సునీల్ శెట్టి ల మధ్య సీన్స్ మెప్పించడం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం సినిమాకి ప్లస్ పాయింట్స్.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… తర్వాత సీన్ ని యిట్టె ఆడియన్స్ చెప్పగలిగేలా ఉండటం, మెయిన్ పాయింట్ పక్కకు పెట్టి ఉప కథ లతోనే సినిమాను నడిపించడం, సినిమా లెంత్ ఎక్కువ అవ్వడం, ఇతర సినిమాలను ప్రతీ సీన్ లో గుర్తు చేసేలా స్క్రీన్ ప్లే ఉండటం, ఫస్టాఫ్ కథ చాలా స్లో గా ఉండటం, ఇలా సినిమాలో మైనస్ పాయింట్స్ బాగానే ఉన్నాయి.

బాలీవుడ్ సుల్తాన్ సినిమా స్టొరీ పాయింట్ ని కొద్దిగా మార్చి, దానికి కొన్ని ఉపకథలను యాడ్ చేసి స్లో నరేషన్ తో ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే తో రూపొందిన సినిమానే పైల్వాన్. ప్రతీ సీన్ ని ఆడియన్స్ యిట్టె చెప్పగలిగేలా ఉండటం తో సినిమా 2 గంటల 40 నిమిషాల లెంతే ఎక్కువ అయింది అనిపించగా…

ఆ స్లో స్క్రీన్ ప్లే వలన అంతకిమించిన లెంత్ ఉన్న సినిమా చూశామా అనిపిస్తుంది పైల్వాన్ సినిమా… మొత్తం మీద సుపీద్ కోసం, సుల్తాన్ సినిమా చూడని వాళ్ళు ఒకసారి చూడొచ్చు. సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here