Home న్యూస్ కన్నడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సుదీప్ కోతిగొబ్బ3…4 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే!!

కన్నడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సుదీప్ కోతిగొబ్బ3…4 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే!!

0

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను లాస్ట్ వీకెండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షేక్ చేయగా కోలివుడ్ బాక్స్ ఆఫీస్ ను డాక్టర్ అండ్ అరణ్మనై 3 సినిమాలు షేక్ చేయగా మలయాళ ఇండస్ట్రీ ఇంకా థియేటర్స్ ని ఓపెన్ చేయాల్సి ఉండగా బాలీవుడ్ వాళ్ళు కూడా ఇంకా ఫుల్ ఫ్లెట్జ్ గా థియేటర్స్ ని ఓపెన్ చేయాల్సి ఉండగా రీసెంట్ గా తిరిగి ఓపెన్ అయిన కన్నడ ఇండస్ట్రీ నుండి సలగ అనే సినిమా…

దాంతో పాటు కిచ్చ సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ కోతిగొబ్బ 3 బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతుంది. ఈగ సినిమాతో తెలుగు లో కూడా పరిచయం ఉన్న సుదీప్ తెలుగు లో పైల్వాన్ సినిమాను డబ్ చేయగా ఈ కోతిగొబ్బ 3 సినిమాను…

కోటికొక్కడు గా త్వరలో డబ్ చేసి రిలీజ్ చేయబోతుండగా కన్నడలో వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా కి ఓపెనింగ్ డే 12 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది అంటూ పోస్టర్స్ వదిలినా ట్రేడ్ వర్గాల ప్రకారం సినిమా…

ఫస్ట్ డే 8.1 కోట్ల గ్రాస్ ను, రెండో రోజు 7.02 కోట్ల గ్రాస్ ను మూడో రోజు 7.2 కోట్ల గ్రాస్ ను అందుకుని మొత్తం మీద 3 రోజుల వీకెండ్ లో 22.32 కోట్ల గ్రాస్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక నాలుగో రోజు వర్కింగ్ డే అయినా 3.9 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసిందట ఈ సినిమా…

దాంతో సినిమా మొత్తం మీద 4 రోజుల్లో కర్ణాటకలో 26.22 కోట్ల గ్రాస్ ను అందుకుని సంచలన హోల్డ్ తో దూసుకు పోతుందట. దాంతో కన్నడ ఇండస్ట్రీ కూడా ఆల్ మోస్ట్ తేరుకున్నట్లే అని అంటున్నారు. ఇది అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్ కి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా తెలుగు లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here