ప్రతీ రీమేక్ సినిమా ఆడాలని రూల్ లేదు, అలాగే ప్రతీ మంచి సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు… ఈ రెండు ఇప్పుడు ఓ టాలీవుడ్ క్లాసిక్ సినిమా కి సరిగ్గ సరిపోతాయి. తెలుగు లో పొలిటికల్ నేపద్యంలో వచ్చినా కానీ క్లాసిక్ అనిపించుకున్న అతి కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచిన సినిమా ప్రస్థానం. దేవకట్ట డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు క్లీన్ హిట్ కాకపోయినా తర్వాత క్లాసిక్ అనిపించుకుంది.
అందులో సాయి కుమార్ చెప్పిన “అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో” డైలాగ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. కాగా ఇదే సినిమా కి దేవకట్ట హిందీ లో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో రీమేక్ చేశాడు.
ఆ సినిమా పోయిన వీకెండ్ లో రిలీజ్ అయింది. ఆ విషయం ఇప్పుడు చెప్పేదాకా చాలా తక్కువ మందికే తెలుసు. కానీ సినిమా కి పాజిటివ్ రివ్యూ లు వచ్చినా వీకెండ్ మొత్తం మీద 3 కోట్లు నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా నాలుగో రోజు కేవలం 30 లక్షల లోపు నెట్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుని డిసాస్టర్ అవ్వబోతుంది.
ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అనే సరికి అందరి లోను ఈ సినిమా అక్కడ సంచలనాలు నమోదు చేస్తుంది అని అనుకున్నారు కానీ అక్కడ సినిమాను నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. ఎదో ప్రొడ్యూస్ చేశాం అంటే చేశాం అనిపించి రిలీజ్ చేశారు.
టాక్ బాగున్నా జనాలు థియేటర్స్ వైపు కూడా వెళ్ళలేదు, అసలు రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు అని టాక్.. తెలుసుకుని థియేటర్స్ కి వెళితే జనాలు లేరని షో లు కాన్సిల్ అయ్యాయట, దాంతో ఇక్కడ క్లాసిక్ అనిపించుకున్న ఈ సినిమా అక్కడ మాత్రం డిసాస్టర్ గా మిగిలిపోబోతుందని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.