Home గాసిప్స్ సైరా లో ఇదే షాకింగ్ ట్విస్ట్ అట…లీక్ అయింది మరి!!

సైరా లో ఇదే షాకింగ్ ట్విస్ట్ అట…లీక్ అయింది మరి!!

0

     మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత చేస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి, భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు స్కై హై రేంజ్ లో ఉన్నాయి. రెండున్నర ఏళ్ళు గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానుల తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కానుండ గా….

సినిమా స్టొరీ లైన్ ఆల్ రెడీ ఇంటర్నెట్ లో లీక్ అయింది, ఆ లీక్ కథ అయితే చెప్పడం లేదు కానీ ఓ సీన్ మాత్రం దాదాపుగా సోషల్ మీడియా లో అందరికీ తెలిసి పోయింది, ఆ తెలిసి పోయిన సీన్ సినిమా క్లైమాక్స్ లో మేజర్ ట్విస్ట్ అని కానీ అది అప్పటికే ఆడియన్స్ కి తెలుస్తుందని అంటున్నారు.

సినిమా లో సైరా నరసింహా రెడ్డి కి తోడుగా స్నేహితుడిగా ఉండే రోల్ లో నటిస్తున్నాడు జగపతి బాబు. కాగా సినిమా మొత్తం స్నేహంగా ఉండే తన రోల్ చివర్లో బ్రిటిష్ వారితో చేతులు కలిసి ఉద్యమ నాయకుడుకి ద్రోహం చేసే రోల్ అని అంటున్నారు. అంటే బాహుబలి లో కట్టప్ప లాంటి రోల్ అన్నమాట.

సైరా సినిమా రియల్ లైఫ్ స్టొరీ అవ్వడం తో ఈ విషయం దాదాపు అందరికీ ముందే తెలుసి ఉంటుంది కానీ సినిమా లో ఆ పాత్ర ఏది అయి ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ జగపతిబాబు రోల్ గురించి చెప్పడం తో అప్పటి నుండి సినిమా లో…

మేజర్ ట్విస్ట్ ఇదే అని అందరికీ తెలిసి పోయింది. కానీ సినిమా మాత్రం అవుట్ స్టాండింగ్ అనిపించే లెవల్ లో ఉంటుందని టాక్ బయట ఉంది. ఇదే కనుక నిజం అయితే మెగాస్టార్ క్రేజ్ తో సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ రికార్డులనన్నీ బ్రేక్ చేసి సంచలనాలు నమోదు చేయడం అయితే పక్కా అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here